Keesara: పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం.. వజ్రేష్ యాదవ్
Keesara: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు.
Keesara: పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం.. వజ్రేష్ యాదవ్
Keesara: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. సొమవారం మల్కాజిగిరి కార్పొరేషన్ కీసర సర్కిల్, కీసర డివిజన్ తిమ్మాయిపల్లి,యాదగిరిపల్లి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో తోటకూర వజ్రేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొని యజమానులతో గృహ ప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమ పథకాలను నిరుపేదలకు, అర్హులందరికీ అందజేస్తామన్నారు ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని ప్రతి కుటుంబం సొంత ఇల్లు కల ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్ష్యం నెరవేరుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కీసర మండల్ అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్, రామిడి విజయ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,జూపల్లి రవీందర్,మధు సుధన్ రెడ్డి, రమేష్ గుప్తా తటాకం లక్ష్మణ్ శర్మ మచ్చని జంగయ్య యాదవ్ రాయల శ్రావణ్ కుమార్ గుప్తా, దయానందం గౌడ్, పన్నాల బుచ్చిరెడ్డి, యూనిటీ కృష్ణారెడ్డి, చినిగిరి నరసింహ, సత్తిరెడ్డి మల్లేష్ యాదవ్ రాజు యాదవ్ చర్లపల్లి కృష్ణారెడ్డి కొండల్ చారి భాను చారి, శి వలింగాల, ఏలూరు శ్రీనివాస్ బక్కని నర్సింగరావు, మల్లారపు సురేష్ గౌడ్.
బండారి ఐలేష్ గౌడ్, కోకటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ యాదయ్య, ఎం ఆంజనేయులు హరిబాబు గౌడ్. బి మల్లేష్ యాదవ్, చిత్తారమ్మ టెంపుల్ చైర్మన్ మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ దాయరా బాల నరసింహ సత్యనారాయణ పుట్ట పెంటయ్య తదితరులు పాల్గొన్నారు