Koheda: మార్కెట్ తరలింపు అన్యాయం.. బిఆర్ఎస్ నేతలు!
Koheda: ఇబ్రహీంపట్నం కోహెడ పండ్ల మార్కెట్ తరలింపును మాజీ మంత్రి హరీష్ రావు వ్యతిరేకించారు.
Koheda: మార్కెట్ తరలింపు అన్యాయం.. బిఆర్ఎస్ నేతలు!
Koheda: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, రైతుల ఆందోళనలు మరియు స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు గారు స్థలాన్ని సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూ, అన్ని వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మార్కెట్‌ను నిర్మించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి కేటాయించి , 350 కోట్ల నిధులు సమకూర్చిందని కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ పేరు వినిపించకుండా చేయాలనే దురుద్దేశంతో తరలించడం అన్యాయమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ హరీష్ రావు గారితో పాటు మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యేలు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, శ్రీ కాలేరు వెంకటేష్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు శ్రీ క్యామ మల్లేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) గారు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నూతన చైర్మెన్ మరియు కౌన్సిలర్‌లను సన్మానించి, శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని శ్రీ హరీష్ రావు గారు అభినందించారు.