Drugs Raid: తారామతిలో మత్తు చిందులు.. పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు!

Drugs Raid: హైదరాబాద్ శివార్లలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో జరిగిన డ్రగ్ పార్టీ కలకలం రేపింది.

Update: 2026-04-06 03:40 GMT

Drugs Raid: తారామతిలో మత్తు చిందులు.. పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు!

Bollywood Actor: చారిత్రక కట్టడాల నీడన, ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలనుకున్న యువత.. మత్తు మార్గాన్ని ఎంచుకుంది. శనివారం అర్ధరాత్రి గడిచిన తర్వాత, అందరూ నిద్రపోతున్న వేళ.. ఈగల్ టాస్క్‌ఫోర్స్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్ , గోల్కొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడితో ఈ భాగోతం బయటపడింది.

మత్తుకు కేరాఫ్ అడ్రస్

ఈ పార్టీకి పెట్టిన పేరు మోర్ దేన్ ఫ్రెండ్స్. కానీ అక్కడ జరిగింది మాత్రం మోర్ దేన్ పార్టీ. సుమారు 300 మంది యువతీ యువకులు హాజరైన ఈ ఈవెంట్‌లో కేవలం హైదరాబాద్ వాసులే కాదు.. దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాల నుండి కూడా భారీగా తరలివచ్చారు. మ్యూజిక్ హోరు, డీజేల కేకల మధ్య మాదక ద్రవ్యాల వినియోగం యథేచ్ఛగా సాగింది.

పట్టుబడిన బాలీవుడ్ నటుడు

ఈ దాడిలో అసలు సంచలనం ఏమిటంటే.. బాలీవుడ్ నటుడు, మోడల్ అబ్దుల్ సర్వర్ పోలీసులకు చిక్కడం. పోలీసులు అనుమానితులైన 35 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాజిటివ్ తేలిన వారు..అబ్దుల్ సర్వర్, యోగేశ్వర్, అభినాశ్ ఫణి, బ్రెట్ జాసన్ మరియు నిహార్-ఆషి అనే దంపతులు. గంజాయి, కొకైన్ వంటి ప్రాణాంతక డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.

నెట్‌వర్క్ గుట్టురట్టు

ఈ పార్టీలో డ్రగ్స్ సరఫరా వెనుక డీజే జాసన్ కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సంగీతం ముసుగులో యువతను మత్తు వైపు మళ్లించేలా ప్రోత్సహించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులందరిపై హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

పోలీసుల లోతైన దర్యాప్తు

నగరంలోకి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ ముఠా వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. కేవలం వాడిన వారినే కాకుండా, సరఫరా చేసిన సప్లయర్లను పట్టుకోవడమే లక్ష్యంగా H-NEW టీమ్ రంగంలోకి దిగింది. పబ్బులు, రిసార్టులలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని భాగ్యనగర పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

Tags:    

Similar News