CP Sajjanar: జాగ్రత్త.. మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ రావచ్చు! కంపెనీలకు సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

CP Sajjanar: హైదరాబాద్ కంపెనీలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక. సీఈఓ పేరుతో వాట్సాప్‌లో వచ్చే మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్త. వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్ నుంచి తప్పించుకునే మార్గాలు మరియు 1930 హెల్ప్‌లైన్ వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-04-04 06:59 GMT

CP Sajjanar: జాగ్రత్త.. మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ రావచ్చు! కంపెనీలకు సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

CP Sajjanar: సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బడా వ్యాపార సంస్థలను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీల CEOలు, CFOలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని "వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్"కు తెరలేపారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. మొదట కంపెనీల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింక్స్ పంపి, మాల్వేర్ ద్వారా కంప్యూటర్లపై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతారు. ఆ తర్వాత సిస్టమ్‌లో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి, సీఈఓ పేరుతో అకౌంటెంట్లకు మెసేజ్ పంపిస్తారు. అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదు. ఈ అకౌంట్‌కు వెంటనే డబ్బులు బదిలీ చేయండని నమ్మబలుకుతూ సంస్థల సొమ్మును కాజేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.

ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రతి కంపెనీ అలర్ట్‌గా ఉండాలని సీపీ సూచించారు. వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని.. అకౌంటెంట్లు వెంటనే సదరు అధికారికి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోవాలని అన్నారు. ఆఫీస్ సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేయడంతో పాటు, వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయాలని ఆయన సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని, సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.  

Tags:    

Similar News