Shamshabad: సీసీటీవీలో రికార్డైన లైవ్ దాడి సద్దాం ప్రాణాల కోసం పోరాటం!
Shamshabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జవహర్ ఇక్బాల్ గ్యాంగ్ బీభత్సం. పాత కక్షతో కరీం సద్దాం అనే యువకుడిని కిడ్నాప్ చేసి, చింతల్ మెట్ వద్ద కర్రలతో విచక్షణారహితంగా దాడి.
Shamshabad: సీసీటీవీలో రికార్డైన లైవ్ దాడి సద్దాం ప్రాణాల కోసం పోరాటం!
శంషాబాద్: గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన జవహర్ ఇక్బాల్ గ్యాంగ్.
టైల్స్ కాంట్రాక్టర్ అయినా జవహర్ ఇక్బాల్ తన అనుచరులతో కలిసి గతంలో తన వద్ద పనిచేసిన కరీం సద్దాం అనే యువకుడిని అతని ఇంటి వద్ద నుండి కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా దాడి చేశాడు.
కరీం సద్దాం జవహర్ వద్ద పని మానేయడంతో తిరిగి తన వద్ద పనిచేయాలని జవహర్ కోరగా సద్దాం తిరస్కరించాడు. ఈ నేపథ్యంలోనే జవహర్ తన అనుచరులతో కలిసి సద్దాంను కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సద్దాం అనే యువకుడిని బైక్ పై కిడ్నాప్ చేసి.. చింతల్ మెట్ ప్రాంతానికి తీసుకొని వచ్చి దాడి. సద్దాం పై పిడు గుద్దుల వర్షం కురిపించిన గ్యాంగ్. విచక్షణారహితంగా కర్రలతో చితకబాది తీవ్రంగా గాయపరచి పారిపోయిన గ్యాంగ్. సిసి టివి కెమరాలో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు. అందరూ చూస్తుండగా రెచ్చిపొయి దాడికి పాల్పడ్డ గ్యాంగ్.
ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. గ్యాంగ్ దాడి లో తీవ్రంగా గాయపడిన సద్దాం ను హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. 100 కు ఫొన్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. పోలీసులను చూసి పారిపోయిన గ్యాంగ్. దాడికి ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు. 25 మంది గ్యాంగ్ సభ్యులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు. వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.