Shamshabad: హిందువునని గర్వించు.. హైదర్‌గూడలో మార్మోగిన నినాదాలు!
Shamshabad: ఆర్‌ఎస్‌ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా రాజేంద్రనగర్ హైదర్‌గూడలో భారీ హిందూ సమ్మేళనం నిర్వహించారు.
Shamshabad: హిందువునని గర్వించు.. హైదర్‌గూడలో మార్మోగిన నినాదాలు!
శంషాబాద్: రాజేంద్రనగర్ లోని హైదర్‌గూడ వేదికగా ఈరోజు భారీ హిందూ సమ్మేళనం జరిగింది . రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని, హిందూ సమాజంలో చైతన్యం నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిచారు.
హైదర్‌గూడ లోని గాంధీ విగ్రహం సమీపంలో ఈరోజు సాయంత్రం జరిగిన హిందూ సమ్మేళనం లో దాదాపు 1000 మది వరకు ప్రజలు పాల్గొనారు.
హిందువుగా జీవించు - హిందువునని గర్వించు" అనే నినాదంతో హిందూ బంధువులందరినీ ఏకం చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా శ్రీ ఎం. విశ్వనాథ్ శర్మ , ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ సహ ప్రాంత కార్యవాహ శ్రీ ఉప్పలంచ మల్లికార్జున్,ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీమతి మోనిక సుంకర పాల్గొనారు.
"గడప లోపల కులం - గడప దాటితే హిందువులం" అనే నినాదంతో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో హిందూ కుటుంబాలన్నీ పాల్గొని హిందూ సమ్మేళననీ విజయవంతం చేశాయి అని ఉత్సవ సమితి తెలిపింది.
హిందూ సమ్మేళనం కార్యక్రమనికి అధ్యక్షుడు గా కోలన్ జైపాల్ రెడ్డి, ఆర్గనైజర్ గా సిదేశ్వర్ వ్యవహరించారు.
వివేకానంద యూత్ అసోసియేషన్, శివాజీ యూత్ అసోసియేషన్, బాబు జగ్జీవన్ రామ్ అసోసియేషన్ లో సహకారం తో కార్యక్రమాన్ని నిర్వహించారు.