Cherlapally: పేదల ఆరోగ్యమే లక్ష్యం.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Cherlapally: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చెర్లపల్లి బస్ స్టాప్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
Cherlapally: పేదల ఆరోగ్యమే లక్ష్యం.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Cherlapally: చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చెర్లపల్లి బస్ స్టాప్ లో కడియాల పోచయ్య జ్ఞాపకార్థం అపోలో వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నియోజకవర్గ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు బస్తీ దావఖానాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. గతంలో చల్లపల్లి అభివృద్ధి కోసం కడియాల పోచయ్య చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరంలో హాజరైన 500 మందికి పైగా వైద్యులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నేమూరీ మహేష్ గౌడ్, తాటి శ్రీనివాస్, నాయకులు గిరిబాబు, బూడిద శ్రావణ్ కుమార్, డప్పు యాదయ్య, నాగిళ్ల బాల్రెడ్డి,బాబు, భరత రాజ్, అనిల్ కుమార్, గడ్డం యాదగిరి, రెడ్డి నాయక్, శ్రావణ్ కుమార్, లోకనాథ్, విజయ్ రాజ్, గణేష్, ధీరజ్ బాలాజీ, అఖిల్, శివంలతో పాటు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.