Hyderabad: అధికారిక గుర్తింపు కార్డుల పంపిణీ.. ట్రాన్స్‌జెండర్ల ఆనందం
Hyderabad: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ట్రాన్స్‌జెండర్లకు అధికారిక గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారు.
Hyderabad: అధికారిక గుర్తింపు కార్డుల పంపిణీ.. ట్రాన్స్‌జెండర్ల ఆనందం
Hyderabad: ట్రాన్స్‌జెండర్ లు సమాజానికి సామాజిక, ఆర్థిక పరంగా మరింత గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అధికారిక గుర్తింపు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అర్హులైన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు గుర్తింపు సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ సర్టిఫికెట్ల ద్వారా వారికి ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లకు సమాజం లో సమాన హక్కులు కలిగిన వారే నని, వారి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందించబడుతుందని తెలిపారు. సమాజంలో సమానత్వం, గౌరవం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తమకు అందిన గుర్తింపు పత్రాలపై ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణ వేణి తదితరులు ఉన్నారు.