Medak: బావను చంపిన బామ్మర్దికి జీవిత ఖైదు!

Medak: మెదక్ జిల్లాలో బావను హత్య చేసిన కేసులో నిందితుడు సంతోష్‌కు కోర్టు జీవిత ఖైదు మరియు రూ. 30 వేల జరిమానా విధించింది.

Update: 2026-04-06 14:27 GMT

Medak: బావను చంపిన బామ్మర్దికి జీవిత ఖైదు!

Medak: బావను హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.30,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ. శ్రీనివాస రావు, తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ వివాదాల నేపథ్యంలో నిందితుడు సంతోష్ తన బావపై ద్వేషం పెంచుకుని పథకం ప్రకారం హత్యకు పాల్పడిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2023లో అప్పటి ఎస్ఐ రాజు కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి ఐఓ సీఐ సంజయ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడి పాత్రను నిర్ధారించే కీలక ఆధారాలను సేకరించారు.

తదుపరి పూర్తి సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. సమర్పించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రస్తుత ఐఓ మెదక్ టౌన్ సీఐ మహేష్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ రామయ్య తదితరులు సహకరించారు. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. కుటుంబ వివాదాలను చట్టపరంగాపరిష్కరించుకోవాలని, హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News