Nandipet: అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం.. భారీగా వాహనాలు స్వాధీనం!

Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేటలో అక్రమ మొరం తవ్వకాలపై సిసిఎస్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.

Update: 2026-04-06 14:04 GMT

Nandipet: అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం.. భారీగా వాహనాలు స్వాధీనం!

Nandipet: జిల్లాలో అనుమతి లేకుండా సాగుతున్న అక్రమ మొరం తవ్వకాలపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వుల మేరకు సి సి ఎస్ అధికారుల భారీ ఆపరేషన్ చేపట్టారు.

నందిపేట్ పోలీస్ పరిధిలోని పల్లి గుట్ట భాగంలో పెద్ద ఎత్తున మొరం అక్రమ రవాణా జరుగుతున్న సమాచారంతో సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ బృందం ఆగస్మిక తనిఖీలు నిర్వహించబడినది. పోలీసు రాకను గమనించి నిందితులు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సిబ్బంది, చాకచక్యంగా వ్యవహరించి తవ్వకలను ఉపయోగిస్తున్న యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడిలో 3 టిప్పర్లు,2 జెసిపిలు, 1 ట్రాక్టర్ చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తట్టుపరి చట్టం పరమైన చర్యలు నిమిత్తం నందిపేట్ ఎస్హెచ్ఓ కు అప్పగించారు, ప్రభుత్వ సంపదను కోల్లగోడుతూ అక్రమ తవ్వకాలకు పాలు పడితే ఉపేక్షిoచేది లేదు, అనుమతి లేకుండా మొరం, ఇసుకే తవ్వకాలు జరిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తం, నిరంతరం నిఘా కొనసాగుతుందని సిపి హెచ్చరించారు.

Tags:    

Similar News