Medak: పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. ఏడుగురు అరెస్ట్!

Medak: మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2026-04-08 16:07 GMT

Medak: పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. ఏడుగురు అరెస్ట్!

Medak: మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. గ్రామంలోని దేవినేని రమేష్ నివాసంలో జూదం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ దాడి చేపట్టారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.46,720 నగదు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జిల్లాలో ఎక్కడైనా జూద కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

Tags:    

Similar News