పీడియాట్రిక్స్‌లో డాక్టర్ దీపక్ రాథోడ్ స్టేట్ ఫస్ట్.. మంత్రి చేతుల మీదుగా నియామక పత్రం!

Nizamabad: తెలంగాణ రాష్ట్ర వైద్య నియామకాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ దీపక్ రాథోడ్ పీడియాట్రిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.

Update: 2026-04-08 15:54 GMT

పీడియాట్రిక్స్‌లో డాక్టర్ దీపక్ రాథోడ్ స్టేట్ ఫస్ట్.. మంత్రి చేతుల మీదుగా నియామక పత్రం!

Nizamabad: తెలంగాణ రాష్ట్ర వైద్య నియామకాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్‌గా డాక్టర్ దీపక్ రాథోడ్ (గోల్డ్ మెడలిస్ట్) కు నియామక పత్రం అందజేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.

ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర నరసింహ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ పిల్లల వైద్యుడు డాక్టర్ దీపక్ రాథోడ్ గోల్డ్ మెడలిస్ట్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్‌గా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ డాక్టర్ దీపక్ రాథోడ్ కృషి, ప్రతిభ, సేవాభావం మరింత ప్రతిష్టాత్మకంగా నిలిచిందనీ,

మంచి సేవలు చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు.వైద్యరంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి అద్భుతమైన సేవలు అందించాలని ఆయన కోరారు. డాక్టర్ దీపక్ రాథోడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్‌గా నియామకం అయినందుకు నిజామాబాద్ జిల్లా డాక్టర్లు, డిచ్ పల్లి మండలవాసులు, నడిపల్లి తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News