Bodhan: బోధన్‌లో పీడీఎస్ బియ్యం గుట్టురట్టు.. రైస్ మిల్లుపై సీసీఎస్ దాడులు, 450 క్వింటాళ్లు సీజ్!
Bodhan: బోధన్ మండలంలోని రాఘవేంద్ర రైస్ మిల్లుపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించి 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Bodhan: బోధన్‌లో పీడీఎస్ బియ్యం గుట్టురట్టు.. రైస్ మిల్లుపై సీసీఎస్ దాడులు, 450 క్వింటాళ్లు సీజ్!
బోధన్: బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలోని రాఘవేంద్ర రైస్ మిల్ పై బుధవారం రాత్రి సిసిఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం రాత్రి హెచ్ఎంటివి వెబ్ లో ప్రచురితమైన పిడిఎస్ బియ్యం రవాణా పై జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పందించారు.
మండలంలోని పెగడపల్లి రైస్ మిల్లు సిసిఎస్ దాడులు నిర్వహించి సుమారు 450 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంను గుర్తించి విచారణ చేపట్టారు. అదే సమయంలో టీఎస్ 16 టీ 0397 ప్యాసింజర్ ఆటోలో తీసుకువచ్చిన పిడిఎఫ్ బియ్యాన్ని సైతం సిసిఎస్ బృందం స్వాధీనపరుచుకున్నారు. మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సిసిఎస్ బృందం వెల్లడించింది.
పట్టణంలోని పలు దుకాణాలపై: సిసిఎస్ పోలీస్ బృందం బోధన్ పట్టణంలోని పలు సూపర్ సూపర్ మార్కెట్, బియ్యందుకాణాలపై దాడులు నిర్వహించి 55 బస్తాల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనపరచుకొని పట్టణ సీఐ వెంకటనారాయణకు అప్పగించారు.