Nizamabad: ఆర్మూర్ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు.. అధిష్టానానికి బీసీ సెల్ ఫిర్యాదు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్‌లో ముదిరిన విబేధాలు! పట్టణ అధ్యక్షుడి తీరుపై బీసీ సెల్ అధ్యక్షుడు దొండి రమణ మండిపాటు.
Nizamabad: ఆర్మూర్ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు.. అధిష్టానానికి బీసీ సెల్ ఫిర్యాదు!
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉన్నట్టా? లేనట్టా?? ఇటీవలే మొన్న జరిగిన 118 వ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకునికి పిలుపు లేదు, కనీసం గ్రూపులో ఒక మెసేజ్ పెడితే అయిపోయేది, అలా కాకుండా అంత నా ఇష్టం అంటే ఎట్లా, అలాగే ఈరోజు బాసరలో అభివృద్ధి పనులకు విచ్చేసిన శ్రీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా కూడా ఎవరికీ పిలుపు లేదు, పట్టణ కాంగ్రెస్ పార్టీ లో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారయింది మరి కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలి వినే నాధుడే లేకుండా పోయిందా.
ఈ సందర్భంగా బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు దొండి రమణ మాట్లాడుతూ, అసలు ఏం జరుగుతుంది ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో, నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎలాంటి కార్యక్రమం జరిగిన గాని, పట్టణ అధ్యక్షుడు విషయం తెలిసిన వెంటనే, గ్రూపులలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు, ఇటీవల జరిగిన జయంతి విషయం గానీ, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు విషయాలు ఉన్నాయి, నిన్ను మన పార్టీ ముఖ్యమంత్రి, మన పక్కన ఉన్న బాసర్ సరస్వతి ఆలయ పుణ్యక్షేత్రానికి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో వచ్చే విషయం కూడా గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇలానే చేసుకుంటూ పోతే మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం చాలా కష్టం, వచ్చే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎలక్షన్లు, చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తే, మనకు సర్పంచ్ ల మెజార్టీ స్థానాలు లాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎంపీటీసీ, జడ్పిటిసి అయిన తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ జెండా ఎగురవేసే అవకాశం ఉంటుంది, ఒకే పార్టీలో ఉంటూ, మా వర్గం, ఈ వర్గం అనకుండా కలిసికట్టుగా ఉంటూ వచ్చే ఎలక్షన్లో మన పార్టీ జెండాను మెజారిటీ ఓట్లతో ఎగురవేయాలి, కావున ఇకనైనా దీనిపై నియోజవర్గ ఇన్చార్జ్, మంత్రులు శ్రద్ధ పెట్టి, ఈ విషయం పై ఆలోచించి, సరిదిద్దాల అంటూ, పట్టణ అధ్యక్షుడు ని ఎన్నిక చేసింది ఇందుకేనా, అసలు ఏ విషయం చెప్పనప్పుడు ఎందుకు ఆ పదవి, దీనిపై అధిష్టానం ఆలోచించి వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అంటూ మాట్లాడాడు.