Armoor: ఆర్మూర్ లో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

Update: 2026-04-05 12:11 GMT

Armoor: ఆర్మూర్ లో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఆర్మూర్: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో మరియు ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాజశేఖర్ అధ్యక్షతన బాబూ జగ్జీవన్ రాం జయంతి నిర్వహించడం జరిగింది. మాజీ ప్రధాని స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రాం జయంతి ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు పని చేస్తామని నినాదాలు చేయడం జరిగింది బాబు జగ్జీవన్ రాం అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భూపతి రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంచేటి గంగాధర్, జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, సీనియర్ నాయకులు ఆకుల శీను, సుంకరి రంగన్న, కౌన్సిలర్లు పాన్ శీను, బొట్టు రాజు, అరుణ్, శ్రావణ్, సీనియర్ నాయకులు లింగన్న, షికారి శ్రీను, బీజేవైఎం అధ్యక్షులు ఉదయ్ గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మిరియాల్కర్ కిరణ్, గిరిజన మోర్చా అధ్యక్షులు పవన్ రాజ్, మనీ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News