Nizamabad: సుద్దపల్లిలో ఐస్ క్రీం బండ్లకు నో ఎంట్రీ! సర్పంచ్ సంచలన ఫ్లెక్సీలు
Nizamabad: నిజామాబాద్ జిల్లా సుద్దపల్లి గ్రామంలో ఐస్ క్రీం బండ్ల ప్రవేశం నిషేధం. చిన్నారుల ఆరోగ్యం మరియు రసాయన పదార్థాల వాడకంపై సర్పంచ్ రూప సతీష్ రెడ్డి ఆందోళన.
Nizamabad: సుద్దపల్లిలో ఐస్ క్రీం బండ్లకు నో ఎంట్రీ! సర్పంచ్ సంచలన ఫ్లెక్సీలు
నిజామాబాద్ జిల్లా: డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఐస్ క్రీం బండ్ల కు గ్రామంలో ప్రవేశం లేదంటూ గ్రామ సర్పంచ్ రూప సతీష్ రెడ్డి, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గ్రామంలో ఎ ఒక్క బండి రాకుండా ఉండేందుకు గాను నడుం బిగించారు. ప్రధానంగ గ్రామంలో ఐస్ క్రీం బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఫ్లెక్సీ రూపంలో ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామంలో అనధికారికంగా తిరుగుతూ ఐస్ క్రీం వ్యాపారం నిర్వహించడంవల్ల గ్రామంలో పరిశుభ్రత సమస్యలు తలెత్తడంతోపాటు చిన్నారుల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చిన్నారులు ఐస్ క్రీమ్ లు తినడంవల్ల ఐస్ క్రీం తయారీలో అనేకరకాలైన రసాయన పదార్థాలు ఉపయోగించి తయ్యారు చేసి గ్రామాల్లో విక్రయించడం ద్వార ఏమి తెలియని చిన్నారులు తమ తల్లి తండ్రుల నుండి తీసుకున్న డబ్బులతో ఐస్ క్రీములు కొనుగోలు చేసి తినడం ద్వార చిన్నారులు అనారోగ్య బారిన పడుతున్నారని ఈ నేపథ్యంలో గ్రామ శ్రేయస్సు దృశ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.