Anantapur: విద్యార్థుల కలల పండుగ! జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ సందడి

Anantapur: అనంతపురం జేఎన్‌టీయూ 15వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు అందజేశారు.

Update: 2026-04-06 07:22 GMT

Anantapur: విద్యార్థుల కలల పండుగ! జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ సందడి

Anantapur: అనంతపురం జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైన జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకలు. జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన రావు అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు శోభను చేకూర్చారు.

కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్‌కు జేఎన్టీయూ అధికారులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 31 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం 45 బంగారు పతకాలను గవర్నర్ అందించనున్నారు.

అలాగే 75 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేయనుండగా, జిల్లాలోని 130కు పైగా అనుబంధ కళాశాలలకు చెందిన మొత్తం 40,782 మంది విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలు ప్రదానం చేయనున్నారు.

ఈ వేడుకలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్‌ను విశ్వవిద్యాలయం ప్రదానం చేయనుంది.

Tags:    

Similar News