CPI News: ఏప్రిల్ 10 నుండి సిపిఐ ‘చలో బండ్లపల్లి’ పాదయాత్ర!

CPI News: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు సిపిఐ భారీ పాదయాత్ర జరగనుంది.

Update: 2026-04-04 14:43 GMT

CPI News: ఏప్రిల్ 10 నుండి సిపిఐ ‘చలో బండ్లపల్లి’ పాదయాత్ర!

CPI News: ఈరోజు స్థానిక బత్తలపల్లి పట్టణం నందు సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్,చేతి వృత్తి దారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాటమయ్య నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, వ్యవసాయ కర్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరిప్ప హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ మాట్లాడుతూ.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 వ తేది నుండి 12 వ తేదీ వరకు అనంతపురం నుండి వయా బత్తలపల్లి బండ్లపల్లి వరకు సిపిఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య,గారి తో రాష్ట్ర నాయకులు ప్రజా సంఘాలు పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బండల వెంకటేష్, సహాయ కార్యదర్శులు ఓబులేసు, సన్నపెద్దన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు, కుల్లాయప్ప, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాలస్వామి,తాడిమర్రి మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, వెంకటస్వామి, వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రం శెట్టి రమణ, యువజన సంఘం జిల్లా కార్యదర్శి సకల రాజా, చెన్నంపల్లి శ్రీనివాసులు, నాగభూషణ,వేణుగోపాల్,శ్రీనివాసులు,మహిళాసమైక్య లీడర్స్ లలితమ్మ,లింగమ్మ, రమీజా, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News