OD Cheruvu: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. అన్నదాత సుఖీభవతో లబ్ధి

OD Cheruvu: రైతు సంక్షేమం, యువతకు ఉపాధి కల్పనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2026-04-04 14:33 GMT

OD Cheruvu: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. అన్నదాత సుఖీభవతో లబ్ధి

OD Cheruvu: రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఓ.డి చెరువు మండల కేంద్రంలో టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళ రెడ్డి సోదరుడు పిట్టా రాజారెడ్డి కి చెందిన శ్రీ ఓబులేశ్వర రైస్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం రైస్ మిల్లును ప్రారంభించారు. శ్రీ ఓబులేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి రఘునాథరెడ్డి మాట్లాడుతూ. మండల కేంద్రంలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గల శ్రీ ఓబులేశ్వర రైస్ మిల్ ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఏటా రూ.20వేలు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా 44 348 రైతులకు రూ. 86.87 కోట్లు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మంజూరు చేశామన్నారు.

అనంతరం మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని పల్లె ప్రారంభించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో స్వచ్ఛ రథాన్ని మంజూరు చేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుళ రెడ్డి, టిడిపి కన్వీనర్ శెట్టివారి జయచంద్ర, దొన్నికోట మహేంద్ర రెడ్డి, సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు తుమ్మల మహబూబ్ బాషా, బోయపల్లి శివారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు జి.వి. ఆదినారాయణ , సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పిట్టా ప్రభాకర్ రెడ్డి, పిట్టా శివ శంకర్ రెడ్డి , మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు బుద్దల ప్రవీణ గోపినాథ్ రెడ్డి, నిజాం, కంచి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News