Sri Sathya Sai: జాతీయ నృత్య పోటీల్లో ఓడి చెరువు విద్యార్థుల ఘనత
Sri Sathya Sai: రాజస్థాన్‌లో జరిగిన 16వ జాతీయ డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్‌లో శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువు విద్యార్థులు మెరిశారు.
Sri Sathya Sai: జాతీయ నృత్య పోటీల్లో ఓడి చెరువు విద్యార్థుల ఘనత
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా: రాజస్థాన్ రాష్ట్రంలోని ఝుంఝునూ జిల్లా కేంద్రం యోగి స్టేడియంలో మార్చి 27, 28, 29 తేదీలలో జరిగిన 16వ జాతీయ డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ నృత్య పోటీలలో ఓడి చెరువు మండల కేంద్రంలోని శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఈ పోటీలలో బ్రేకింగ్, లాటిన్, సాల్సా, బాలీవుడ్, ఫ్రీస్టైల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్ డాన్స్ స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాల్గొన్న నిధి, నిషి విద్యార్థులు సాల్సా కేటగిరీ జువెనైల్ విభాగంలో తమ ప్రతిభను చాటారు. జాతీయ స్థాయిలో నిధి గోల్డ్ మెడల్, నిషి సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి సవితమ్మ విజేతలైన విద్యార్థులు నిధి, నిషి, వారికి శిక్షణ అందించిన మాస్టర్ డా. మనోహర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఇలాంటి జాతీయ స్థాయి పోటీలలో మరింత ప్రతిభ కనబరచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.