Kadiri: మీ భద్రతే మా బాధ్యత.. విద్యార్థినులకు ‘శక్తి యాప్’పై అవగాహన

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'శక్తి యాప్'పై అవగాహన కల్పించారు.

Update: 2026-04-04 14:50 GMT

Kadiri: మీ భద్రతే మా బాధ్యత.. విద్యార్థినులకు ‘శక్తి యాప్’పై అవగాహన

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ పరిధిలోని శిర్డీసాయి హై స్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “శక్తి యాప్” పై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు విద్యార్థినులకు శక్తి యాప్ ప్రాముఖ్యత, సైబర్ క్రైమ్‌లు, బాల్య వివాహాలు, పోక్సో చట్టం, మహిళలు మరియు పిల్లలపై జరిగే నేరాలు, అలాగే అత్యవసర సహాయ నంబర్లు 100, 112, 181, 101, 1930, 1098 గురించి విద్యార్థులకు వివరించారు. అదనంగా ఫ్రాడ్ లోన్స్, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, కోడిపందాలు (Cock Fight) వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.

ఇటీవల మహిళలపై జరుగుతున్న నేరాల నేపథ్యంలో విద్యార్థినులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, తమ భద్రత తమ చేతుల్లోనే ఉందని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా ఒక్క క్లిక్‌తోనే పోలీసుల సహాయం పొందవచ్చని, అలాగే తమ లొకేషన్‌ను వెంటనే పోలీసులతో పంచుకోవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా “మహిళలు భయపడాల్సిన అవసరం లేదు – చట్టం మీ వెన్నంటే ఉంది. ఏ సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి” అని శక్తి టీమ్ సభ్యులు విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు పీసీ ఎస్. చలపతి, చౌకత్ ఖాన్, గణాధర్ హెడ్ కానిస్టేబుల్ (ఇన్‌చార్జ్), అనూష పాల్గొన్నారు. అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం హాజరై విద్యార్థినులకు విలువైన సూచనలు అందించారు.

పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో మహిళల భద్రతకు బలమైన పునాది వేస్తాయని నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News