Puttaparthi: నూతన వధూవరులను ఆశీర్వదించిన పల్లె రఘునాథ్ రెడ్డి!
Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన పలు వివాహాలు, మరియు కేశఖండన కార్యక్రమాలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Puttaparthi: నూతన వధూవరులను ఆశీర్వదించిన పల్లె రఘునాథ్ రెడ్డి!
Puttaparthi: పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన పలు శుభ కార్యాలకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పుట్టపర్తి సాయి ఆరామంలో పెద్ద కమ్మవారి పల్లికి చెందిన లెక్కల బుచ్చప్ప గారి నాయుడు కుమారుడు వికాస్ వెంకటాద్రి కుమార్తె సాయి వందన నిశ్చితార్థం కార్యక్రమానికి మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను మాజీమంత్రి ఆశీర్వదించారు.
అదేవిధంగా జగరాజుపల్లి వద్ద ఉన్న కన్వర్షన్ హాల్లో కొత్తచెరువు చెందిన మాణిక్యం ఇషాక్ కుమారుడు ఎండి సుహేల్ వధువు నసీరా అంజుమ్ వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వరుడు సుహేల్ ను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పెద్ద కమ్మవారి పల్లి చింతావనం లో ఉన్న పోతులయ్య స్వామి వద్ద,
నిర్వహించిన పెద్ద కమ్మవారిపల్లి కి చెందిన బండేరు రామకృష్ణ తలిపినేని రామప్ప మనవడు ధార్విక్ చౌదరి కేశఖండన కార్యక్రమానికి మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. పోతులయ్య స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. కేశఖండన కార్యక్రమంలో చిన్నారి ధార్విక్ చౌదరినీ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు కూటమి పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.