Salur: జగన్ విధ్వంసానికి చెక్.. అమరావతే రాష్ట్ర ఆర్థిక శక్తి!

Salur: సాలూరు నియోజకవర్గంలో అమరావతి రాజధానికి మద్దతుగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

Update: 2026-04-05 15:37 GMT

Salur: జగన్ విధ్వంసానికి చెక్.. అమరావతే రాష్ట్ర ఆర్థిక శక్తి!

Salur: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పునర్నిర్మాణానికి మద్దతుగా సాలూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది కూటమి శ్రేణులు, రైతులు, మరియు యువత "జై అమరావతి" నినాదాలతో హోరెత్తించారు.

జగన్ విధ్వంసానికి చెక్ - చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష:

ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో సాగుతోందని కొనియాడారు. "గత ఐదేళ్ల జగన్ విధ్వంసానికి ప్రజలే చెక్ పెట్టారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శక్తి. రాష్ట్ర అభివృద్ధికి అమరావతే దిక్సూచి" అని ఆమె స్పష్టం చేశారు.

వైసీపీ ద్వంద్వ వైఖరిపై ధ్వజం:

పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత విషయంలో దేశంలోని 50కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా, కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించి వాకౌట్ చేయడం వారి నీచ రాజ రాజకీయాలకు నిదర్శనమని మంత్రి మండిపడ్డారు.

Tags:    

Similar News