Bobbili: బొబ్బిలి రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధికి నిధుల వరద

Bobbili: విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.

Update: 2026-04-05 16:19 GMT

Bobbili: బొబ్బిలి రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధికి నిధుల వరద

Bobbili: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు రెండేళ్లలో ఇంటింటి కుళాయిలు మంజూరు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి కె.నారాయణ చెప్పారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే బేబినాయన మాట్లాడుతూ రోడ్లు విస్తరణకు, బైపాస్ రోడ్డు నిర్మాణానికి, పార్కు అభివృద్ధికి, పట్టణ శివారు ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.

అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.రూ.14 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. బొబ్బిలి బజారు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేస్తామని డిపిఆర్ ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి ఆలయం వరకు రోడ్డుకు రూ. 2కోట్లు మంజూరు చేస్తామన్నారు. శివారు కాలనీలు అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేస్తామన్నారు.

పార్కు అభివృద్ధికి, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి రూ. 50లక్షలు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ నిధులను మల్లించి అభివృద్ధి చేయలేదన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలో రూ.3 వేల కోట్లు దారి మళ్లీస్తే ఇప్పటికి రూ.1700 కోట్లు నిధులు విడుదల చేశామని, మిగిలిన రూ. 1300 కోట్లు విడుదల చేస్తామన్నారు. . మున్సిపాలిటీలో వస్తున్న పన్నులను ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు.

Tags:    

Similar News