Kalyandurgam: బాధితుడి కష్టమే తన కష్టంగా.. ఎమ్మెల్యే అమిలినేని మానవత్వం
Kalyandurgam: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన రామంజి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kalyandurgam: బాధితుడి కష్టమే తన కష్టంగా.. ఎమ్మెల్యే అమిలినేని మానవత్వం
Kalyandurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామానికి చెందిన రామంజి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాల మేరకు టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, బీఎస్ఎన్ఎల్ అడ్వైజర్ మెంబర్ అమర రామ్మోహన్, మరియు అమర లింగారెడ్డి, సర్పంచ్ వనిత, మల్లికార్జున ఆదివారం ఆసుపత్రిని సందర్శించారు.
బాధితుడు రామంజిని పరామర్శించి,వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్పూర్తితో బాధితుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 50,000/- నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ నాయకుడు అమిలినేని సురేంద్ర బాబు నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావిస్తారని, బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. తమ ఆపద సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ఎమ్మెల్యేకు బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.