Salur: మాస్టర్ ప్లాన్ కలకలం.. అధికారుల తీరుపై రాజన్నదొర ఆగ్రహం!
Salur: సాలూరు పట్టణంలో మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్ల విస్తరణ చేపట్టడంపై మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మండిపడ్డారు.
Salur: మాస్టర్ ప్లాన్ కలకలం.. అధికారుల తీరుపై రాజన్నదొర ఆగ్రహం!
Salur: సాలూరు పట్టణంలో పి.రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో అయన మాట్లాడుతూ, మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్లు విస్తరణ చేస్తామని హడావుడి చేసి ఇరువైపులా పట్టణంలోని కొలతలు నిర్వహించి తక్షణమే విస్తరణ చేపడుతామని పట్టణ ప్రజలతో పాటు వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురు చేయడం అధికారులకు సరైనది కాదని అన్నారు. ఈ విధంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు తెలియకుండా అధికారులు ఇటువంటి రోడ్ల విస్తరణ చర్యలు చేపట్టే ప్రసక్తే లేదని అన్నారు.
అలాంటి సందర్భంలో అధికారులు ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి మాస్టర్ ప్లాన్ రూపంలో ఎన్నికల అస్త్రంగా ఉపయోగించి ఓట్లు కోసం బెదిరించి భయపెట్టి వేధించి దుకాణాలను తీసివేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడడమే ఈ తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న రాష్ట్రంలోని ఈ విధంగా రోడ్ల విస్తరణ పేరుతో రెడ్ బుక్కు రాజ్యాంగ అమలు చేయడం కాదని అన్నారు.