Nellore: నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి జాతర
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 37వ డివిజన్ క్రాంతి నగర్‌లో రూ. 1 కోటి వ్యయంతో నిర్మించిన బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.
Nellore: నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి జాతర
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 37 వ డివిజన్ క్రాంతి నగర్ లో కోటి రూపాయలతో నిర్మించిన బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మరియు స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ:
నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో వాడవాడల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశీస్సులతోనే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.
ప్రజల సహకారంతోనే ఈ ప్రాంతంలో బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ సాధ్యమైందని. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు, కో క్లస్టర్ ఇంచార్జిలు డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, టిడిపి, జనసేన మరియు బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.