Anantapur: అనంతపురంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
Anantapur: అనంతపురంలో బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Anantapur: అనంతపురంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
Anantapur: వివక్షతకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు, బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా అనంతపురం సప్తగిరి కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు.
వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చి అనేక సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థానాలకు ఎదిగిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు, దేశ రాజకీయాల్లో సమానత్వానికి ప్రతీకగా నిలిచిన నాయకుడిగా బాబు జగజీవన్ రామ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఇలాంటి మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు.