Nalgonda: అధికారుల మౌనం.. మాఫియాకు వత్తాసా? నల్లగొండలో బీజేపీ నేతల గర్జన

Nalgonda: నల్లగొండ జిల్లాలో బైపాస్ రోడ్డు నిర్మాణం పేరుతో సాగుతున్న మట్టి మాఫియాపై బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Update: 2026-04-06 07:16 GMT

Nalgonda: అధికారుల మౌనం.. మాఫియాకు వత్తాసా? నల్లగొండలో బీజేపీ నేతల గర్జన

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న మట్టి మాఫియా ఆగడాలపై బీజేపీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పెద్ద గడియారం సెంటర్లో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డు నిర్మాణ ముసుగులో జరుగుతున్న అక్రమాలను ఆయన ఎండగట్టారు.నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతుల పేరుతో వివిధ గ్రామాల చెరువులను కొల్లగొడుతున్నారని వర్షిత్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన మట్టిని అక్రమంగా తరలిస్తూ, సహజ వనరులను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. అధికారుల కళ్లముందే చెరువులు రూపురేఖలు కోల్పోతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.

Tags:    

Similar News