Sabarimala: శబరిమలలో మహిళల ప్రవేశం.. పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

Sabarimala: శబరిమలలో మహిళల ప్రవేశం అంశంలో సుప్రీం కోర్టు 2018 లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విస్తృత ధర్మాసనం విచారించనుంది.

Update: 2026-04-06 07:47 GMT

Sabarimala

Sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన సమీక్షా పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు మళ్లీ విచారించనుంది. మొదటి మూడు రోజులు అంటే ఏప్రిల్ 7,8,9 తేదీలలో శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించే వారి వాదనలను వినడానికి కేటాయించారు. మహిళల ప్రవేశానికి అనుకూలంగా ఉన్న వారి వాదనలను ఏప్రిల్ 14, 15, 16 తేదీలలో వింటారు. మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటిషన్‌ను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని నిన్న(ఏప్రిల్ 5) ఏర్పాటు చేశారు.

బెంచ్‌లో బి.వి. నాగారత్న ఏకైక మహిళా సభ్యురాలు. ఇదిలా ఉండగా, మహిళల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మత పండితులు, సంఘ సంస్కర్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అయితే, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, ఇతరులు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నారు.

శబరిమల ఒక నిర్దిష్ట మత విభాగానికి చెందిన ఆలయమని, రాజ్యాంగపరమైన మతపరమైన విషయాలపై సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు దేవస్వం బోర్డుకు ఉందని దేవస్వం బోర్డు కోర్టుకు తెలియజేసింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ సిద్ధం చేసిన వాదనలను స్టాండింగ్ కౌన్సిల్ పి.ఎస్. సుధీర్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

కేసు నేపధ్యం ఇదీ..

శబరిమలలో మహిళల ప్రవేశంపై నిశేధం ఉంది. ముఖ్యంగా 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఆలయంలో ప్రవేశం ఉండదంటూ శబరిమలలో ఉన్న నియమాలపై సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. దీనిపై విచారించిన కోర్టు 2018లో సంచలన తీర్పు ఇచ్చింది.

2018లో తీర్పు..

20218లో భారత సుప్రీంకోర్టు ధర్మాసనం 4:1 మెజారిటీతో కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ, అన్ని వయస్సుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం అనుమతించాలని ఆదేశించింది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

రివ్యూ పిటిషన్లు..

ఈ తీర్పు వెలువడిన తర్వాత కేరళలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొందరు భక్తులు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టగా, మరికొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఆ తరువాత ఈ తీర్పుపై అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనం కి పంపింది. ప్రస్తుతం ఈ కేసు మతాచారాలు vs రాజ్యాంగ హక్కులు అనే కీలక చర్చగా కొనసాగుతోంది.

Tags:    

Similar News