Petrol Price: భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 82 మాత్రమే...ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ, ఒక ప్రాంతంలో మాత్రం లీటర్ పెట్రోల్ రూ.82కే లభించడం ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ధరలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసా...

Update: 2026-04-06 05:15 GMT

Petrol Price: భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 82 మాత్రమే...ఎక్కడో తెలుసా?

Petrol Price: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ, ఒక ప్రాంతంలో మాత్రం లీటర్ పెట్రోల్ రూ.82కే లభించడం ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ధరలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసా... అండమాన్ నికోబార్ దీవుల్లో. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.105 నుంచి రూ.110 మధ్య ఉండగా, ఇక్కడ దాదాపు రూ.20 వరకు తక్కువగా లభించడం గమనార్హం.

పెట్రోల్‌ ధరలు

ప్రస్తుతం దేశంలో సాధారణ పెట్రోల్ ధర సుమారు రూ.107 వరకు ఉండగా, డీజిల్ ధర రూ.100కు చేరువలో ఉంది. అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్ రూ.82, డీజిల్ రూ.78 మాత్రమే. ఈ తేడా సాధారణంగా కనిపించినా, దీని వెనుక ఉన్న కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇందులో మొదటగా చెప్పుకోవలసింది పన్నుల విధానం. సాధారణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ఎక్సైజ్ డ్యూటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ కూడా ఉంటుంది. ఈ వ్యాట్‌ రాష్ట్రాలను బట్టి వ్యాట్ 25% నుంచి 35% వరకు ఉంటుంది. ఈ కారణంగానే ధరలు భారీగా పెరుగుతాయి. కానీ అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవడం వల్ల ఈ అదనపు పన్నులు ఉండవు. కేవలం కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం మాత్రమే ఉండటంతో ధరలు తక్కువగా ఉంటాయి.

ధరల తగ్గింపుకు కారణాలు

కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉండటానికి కీలకమైన కారణం సెస్‌లు లేకపోవడం. రాష్ట్రాలు అభివృద్ధి కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, సంక్షేమ పథకాలు అమలు కోసం ప్రత్యేకమైన సెస్‌లు విధిస్తుంటాయి. ధరల పెరుగుదలలో సెస్‌లు కీలక పాత్రను పోషిస్తాయి. కానీ, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో సెస్‌ ఉండకపోవడం వలన వినియోగదారులకు తక్కువ ధరలు ఇంధనం దొరుకుతుంది. అంతేకాదు, రవాణా ఖర్చులు కూడా ధరలపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా రాష్ట్రాల్లో దూర ప్రాంతాల నుంచి ఇంధనాన్ని తరలించాలి. దీనికోసం అదనంగా ఖర్చు అవుతుంది. కానీ, అండమాన్‌ దీవుల్లో ప్రభుత్వ నియంత్రణలోనే సరఫరా వ్యవస్థ ఉండటం వలన ధరలపై అదనపు భారం ఉండదు. అంతేకాదు, ఇక్కడి పెట్రోల్‌ బంక్‌ యజమానుల కమీషన్‌ కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఒక్క అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మాత్రమే కాదు, రాష్ట్రప్రభుత్వాలు లేని కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్‌ హవేలీ, డామన్‌ డయ్యూ వంటి ప్రాంతాల్లో కూడా ఇంధనం ధరలు తక్కువగానే ఉంటాయి. కానీ, వీటి కంటే కూడా అండమాన్‌ దీవుల్లో ధరలు తక్కువగా ఉండటం విశేషం.

Tags:    

Similar News