Parvathipuram: ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి! పార్వతీపురం కలెక్టర్ సంక్షేమ బాట

Parvathipuram: పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి 9 మంది వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.

Update: 2026-04-06 08:19 GMT

Parvathipuram: ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి! పార్వతీపురం కలెక్టర్ సంక్షేమ బాట

పార్వతీపురం: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.​ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా 9 మంది వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను (మూడు చక్రాల సైకిళ్లు) అందజేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగులు అంగవైకల్యాన్ని శాపంగా భావించకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ట్రై సైకిళ్లు వారి దైనందిన జీవితంలో రవాణా కష్టాలను తగ్గిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న శాఖ ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని తెలిపారు.

Tags:    

Similar News