KKR vs PBKS 2026: కేకేఆర్ సంచలన నిర్ణయం, స్టార్ ప్లేయర్స్ అవుట్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ప్లేయింగ్ 11 ఇదే!

KKR vs PBKS IPL 2026 predicted playing 11: ఐపీఎల్ 2026లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్) ఈరోజు తలపడనున్నాయి.

Update: 2026-04-06 07:27 GMT

KKR vs PBKS 2026: కేకేఆర్ సంచలన నిర్ణయం, స్టార్ ప్లేయర్స్ అవుట్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ప్లేయింగ్ 11 ఇదే!

KKR vs PBKS 2026: ఐపీఎల్ 2026లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్) ఈరోజు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కేకేఆర్‌కు అత్యంత కీలకంగా మారింది. వరుస పరాజయాలతో సీజన్‌ను ప్రారంభించిన కేకేఆర్.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా బంతితో విఫలమై ఓటమిని ఎదుర్కొంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పోరులో బంతి, బ్యాట్‌తో తడబడి మరో పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో పీబీకేఎస్ మ్యాచ్‌లో కోల్‌కతాకు గెలుపు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జట్టులో కీలక మార్పులకు కేకేఆర్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

కేకేఆర్ బౌలింగ్ విభాగం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా పేరొందిన వరుణ్ చక్రవర్తి ఈ సీజన్‌లో ప్రభావం చూపలేకపోతున్నాడు. వికెట్లు తీయకపోగా పరుగులు కట్టడి చేయడంలో కూడా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతడిని తాత్కాలికంగా పక్కన పెట్టాలని కేకేఆర్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. నవదీప్ సైనీ కూడా జట్టులోకి రావచ్చు. వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి విఫలమవుతుండడంతో బౌలింగ్‌లో మార్పులు ఖాయం అని తెలుస్తోంది. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్, హర్షిత్‌ రాణా, ఆకాశ్‌ దీప్, పతిరనలు దూరం కావడంతో కేకేఆర్ బౌలింగ్‌లో బలహీనపడింది.

బ్యాటింగ్ విభాగంలో కూడా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అతడి స్థానంలో సీనియర్ మనీష్ పాండేను జట్టులోకి తీసుకునే ఆలోచనలో కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం. కెప్టెన్ అజింక్య రహానేకు ఇది కీలక నిర్ణయంగా మారింది. ఫిన్ అలెన్, కెమెరాన్ గ్రీన్, అంగ్రిష్ రఘువంశీ, రింకు సింగ్ చెలరేగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ కేకేఆర్‌కు ‘డూ ఆర్ డై’గా మారింది. జట్టులో మార్పులు చేసి బలంగా తిరిగి రావాలని ప్రయత్నిస్తున్న కేకేఆర్.. పంజాబ్ కింగ్స్ దూకుడును ఎలా ఆపుతుందో చూడాలి.

ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ బలంగా కనిపిస్తోంది. తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలిచిన కోల్‌కతా.. రెండో పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి రెండో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పుంది. మ్యాచ్‌కు వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి.

తుది జట్లు (అంచనా):

కేకేఆర్: అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కెమెరాన్ గ్రీన్, అంగ్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), మానిష్ పాండే/రమన్‌దీప్ సింగ్, రింకు సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్/నవదీప్ సైనీ, వరుణ్ చక్రవర్తి, బ్లెస్సింగ్ ముజరబాని, కార్తిక్ త్యాగి.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.

Tags:    

Similar News