Medak: సింగూరు నీటి కోసం బీఆర్ఎస్ పోరు కలెక్టరేట్‌లో పద్మా దేవేందర్ రెడ్డి వినతి!

Medak: మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుండి వెంటనే నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Update: 2026-04-06 07:31 GMT

Medak: సింగూరు నీటి కోసం బీఆర్ఎస్ పోరు కలెక్టరేట్‌లో పద్మా దేవేందర్ రెడ్డి వినతి!

మెదక్: సింగూర్ ప్రాజెక్టు నుంచి వనదుర్గ ప్రాజెక్టు ఘనపూర్ ఆయకట్టకు వెంటనే 0.3 టీఎంసీ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ప్రతిమ సింగ్ ను బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని జీవో ఉన్నప్పటికీ కాలయాపన చేయడం జరుగుతుందని ఆయన ఆమె అన్నారు సింగూరు డ్యాం రిపేర్ పేరిట క్రాఫ్ హాలిడే ప్రకటించాల్సింది పోయి రైతులు దుక్కి దున్నిన తర్వాత క్రాఫ్ హాలిడే ప్రకటించడం జరిగిందని ఆమె అన్నారు.

ఎండలు అధిక ఉష్ణోగ్రత ఉండటంతో బోరు బావులు ఎండిపోవడం జరిగిందని. రైతులకు మంజీరా పరిహాక ప్రాంతానికి మంజీరా నది ఒకటే మార్గం అని ఇప్పటికైనా సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ జడ్పీ చైర్మన్ లావణ్య రెడ్డి మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్. పార్టీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు కార్యదర్శి గడ్డమీద కృష్ణారావు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News