Medak: రేషన్ బియ్యంపై వదంతులు నమ్మకండి
Medak: మెదక్ జిల్లా ప్రజలకు అలర్ట్ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 3 నెలల సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు.
Medak: రేషన్ బియ్యంపై వదంతులు నమ్మకండి
Medak: మెదక్ జిల్లా ప్రజలకు సమాచారం మేరకు జిల్లాలో మొత్తం 520 రేషన్ దుకాణాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన (03) నెలల సన్న బియ్యం నిల్వలు రేషన్ సమృద్ధిగా ఉంచబడి, నిరంతరంగా సరఫరా చేయబడుతున్నాయి. జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్న (03) నెలల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ నెల 30-04-2025 వరకు కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడు ఎలాంటి తొందరపాటు లేకుండా సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు పొందవలసిందిగా కోరడమైనది. సరుకుల కొరత లేదా పంపిణీ నిలిచిపోవడం వంటి ఎలాంటి సమస్యలు లేవని స్పష్టంగా తెలియజేయబడుతోంది. అని అన్నారు.
జిల్లా పరిపాలన తరఫున సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాము. సంబంధిత అధికారులు మరియు సిబ్బంది అందరూ అప్రమత్తంగా పనిచేస్తూ, పారదర్శకంగా మరియు సకాలంలో సన్న బియ్యం సరఫరా జరిగేలా కృషి చేస్తున్నాము. అని చెప్పారు.
ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, గందరగోళానికి లోనుకాకుండా, ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే (03) రేషన్ సరుకులను ఈ నెల 30 వ తేది వరకు పొందాలని విజ్ఞప్తి చేయడమైనది. ఏవైనా సమస్యలు ఎదురైన పక్షంలో సమీప తహసీల్దార్ కార్యాలయం లేదా సంబంధిత సివిల్ సప్లై అధికారులను సంప్రదించవచ్చు. అని వెల్లడించారు.