Karimnagar: వికలాంగుల పాఠశాలలు ఆధునిక దేవాలయాలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని మేథో వికలాంగుల ప్రత్యేక పాఠశాల 36వ వార్షికోత్సవంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
Karimnagar: వికలాంగుల పాఠశాలలు ఆధునిక దేవాలయాలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేథో వికలాంగుల ప్రత్యేక పాఠశాల(మానసిక వికలాంగుల పాఠశాల) 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియో థెరఫీ, స్పీచ్ థెరఫీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి.
మానసిక విద్యార్థులతో మాట్లాడి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్యులోపంతో పుట్టిన పిల్లలను మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందిస్తూ, ఇలాంటి పాఠశాలకు ప్రతీ ఒక్కరూ తమవంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు.
ఇలాంటి పాఠశాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే, ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తనవంతు సహాకారం అందిస్తూనే, రాబోవు రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్టు సభ్యులు సన్మానించి, జ్ఞాపికలను అందించారు.