Gajwel: కేసీఆర్‍ క్యాంప్ ఆఫీస్‍పై దాడి, హరీశ్ రావు ఫైర్!

Gajwel: గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‍ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల హల్‌చల్‌ దుమారం రేపింది.

Update: 2026-04-04 11:20 GMT

Gajwel: కేసీఆర్‍ క్యాంప్ ఆఫీస్‍పై దాడి, హరీశ్ రావు ఫైర్!

Gajwel: గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‍ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల హల్‌చల్‌ దుమారం రేపింది. ఆంక్షరెడ్డి నేతృత్వంలోని శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో కార్యాలయం లోపలకి దూసుకెళ్లి “జై కాంగ్రెస్” నినాదాలతో ఉద్రిక్తత సృష్టించారు. ఘటనపై పోలీసు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలో ఉద్రిక్తత

గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్‍ క్యాంప్ కార్యాలయంలో దూసుకెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టి, “జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేశారు. ఫర్నీచర్, కిటికీలు ధ్వంసం అయ్యాయని అధికారులు సమాచారం అందించారు.

కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల పరస్పర ఆరోపణలు

ఈ దాడికి కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. అయితే కాంగ్రెస్ నేతలు, వారు కేవలం సీఎం ఫోటో పెట్టారని, ఎలాంటి దాడి చేయలేదని చెబుతున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

హరీశ్ రావు మండిపాటు

మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ఘటనను ఖండించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై చేసిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు. రాజకీయ విర్రవీగత, అధికార మదం కారణంగా కాంగ్రెస్ ముప్పేట దాడులు చేస్తోందని విమర్శించారు.

పోలీసు మౌనంపై ప్రశ్నలు

పోలీసుల ప్రవర్తనను హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్య, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రైవేట్ సైన్యంలా మారిపోయారని నిందించారు. “హేట్ స్పీచ్ బిల్” పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తూ, మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యమా?” అని ప్రశ్నించారు.

Tags:    

Similar News