Gangadhara: గురుకులంలో అర్ధరాత్రి రచ్చ.. విద్యార్థుల మధ్య ఘర్షణ!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధరలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Gangadhara: గురుకులంలో అర్ధరాత్రి రచ్చ.. విద్యార్థుల మధ్య ఘర్షణ!
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో అర్ధరాత్రి సమయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చి కొట్టుకోవడంగా మారగా, కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టడం, పాఠశాల అధికారులు జర్నలిస్టులను లోపలికి అనుమతించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. రాత్రి విధుల్లో ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ ఘటన ఎలా జరిగిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ పరిణామాలతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం జరిగిందా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.