Karimnagar: ప్రైవేట్ కళాశాలల ఆగడాలు విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ఆవేదన

Karimnagar: కరీంనగర్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వేసవి సెలవులు అమలు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ (ABVP) నిరసన చేపట్టింది.

Update: 2026-04-04 09:20 GMT

Karimnagar: ప్రైవేట్ కళాశాలల ఆగడాలు విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ఆవేదన

కరీంనగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-ABVP కరీంనగర్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన వేసవి సెలవులను ఉల్లంఘించి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులకు సెకండ్ ఇయర్ సేలబస్ చెప్పుతూ కళాశాలలు ఇష్టానుసారంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల పైన చర్యలు తీసుకోవాలని DIEO ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్ పూసాల విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ సెకండ్ ఇయర్ సేలబస్ బోధిస్తూ తరగతులు నడుపుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రవేట్ కళాశాలలను ఇష్టానుసారంగా నడుపుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్ల దగ్గర నుంచి లంచాలు తీసుకొని వారికి వత్తాసు పలుకుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న DIEO నీ వెంటనే సస్పెండ్ చేయాలి అని అన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన సెలవులు విద్యార్థుల ఆరోగ్యం, మానసిక స్థితి మరియు విశ్రాంతి కోసం జారీ చేయబడ్డాయి అయినప్పటికీ,DIEO స్వయంప్రతిపత్తితో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం జరుగుతుంది. తీవ్రమైన అవినీతి, అధికార దుర్వినియోగం. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వేసవి సెలవుల ప్రయోజనం కోల్పోతున్నారు అని అన్నారు. వెంటనే సంబంధిత డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ (DIEO)ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

అనధికార తరగతులు నడుపుతున్న అన్ని కళాశాలలపై తక్షణం చర్యలు తీసుకోవాలి.విద్యార్థులకు ప్రకటించిన వేసవి సెలవులు కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హాస్టల్స్ కో-కన్వీనర్ బామాండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముసరి మురళి కార్యకర్తలు నాగరాజు, విగ్నేష్, విష్ణు, హర్షిత్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News