Assembly Elections 2026: 5 రాష్ట్రాల ఎన్నికలు.. తెలంగాణలోని ఆ ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు..!
Assembly Elections 2026: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏప్రిల్ నెలలో పోలింగ్ జరిగే రోజుల్లో ఇతర రాష్ట్రాల ఓటర్లకు జీతంతో కూడిన సెలవు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Assembly Elections 2026: 5 రాష్ట్రాల ఎన్నికలు.. తెలంగాణలోని ఆ ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవు..!
Assembly Elections 2026: అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు చెందిన ఓటర్లు తెలంగాణలోని వివిధ సంస్థల్లో పని చేస్తున్నట్లయితే, వారు తమ సొంత రాష్ట్రాల్లో ఓటు వేయడానికి వెళ్లేందుకు వీలుగా పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది.
ఎవరికి వర్తిస్తుంది?
ఈ సెలవు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే కాకుండా.. ప్రైవేట్ ఫ్యాక్టరీలు, షాపులు, వాణిజ్య సంస్థలు మరియు ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఈ సెలవు దినానికి సంబంధించి అదనపు వేతనం కోత విధించకూడదని (Paid Holiday) ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎన్నికల తేదీలు - సెలవుల వివరాలు:
అసోం, కేరళ, పుదుచ్చేరి: ఈ రాష్ట్రాల ఓటర్లకు ఏప్రిల్ 9, 2026న సెలవు.
తమిళనాడు: తమిళనాడుకు చెందిన ఓటర్లకు ఏప్రిల్ 23, 2026న సెలవు.
పశ్చిమ బెంగాల్: బెంగాలీ ఓటర్లకు ఆయా దశల వారీగా ఏప్రిల్ 23 మరియు ఏప్రిల్ 29 తేదీల్లో సెలవు వర్తిస్తుంది.
ప్రభుత్వ ఆదేశం:
అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలు తమ వద్ద పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల ఓటర్లకు ఓటు వేసేందుకు పూర్తి సహకారం అందించాలని, చట్టపరమైన నిబంధనల ప్రకారం సెలవు మంజూరు చేయాలని కార్మిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.