Mahabubabad: మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రైతులతో ముఖాముఖి
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పిస్తూ, కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
Mahabubabad: మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రైతులతో ముఖాముఖి
Mahabubabad: జిల్లాలోని మొక్కజొన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్దతు ధర కల్పిస్తూ కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణం ఇల్లందు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా రైతులు, మార్కెటింగ్, వ్యవసాయ, సంబంధిత అధికారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు.
జిల్లాలో ఈ సంవత్సరం 1లక్ష 30 వేల ఎకరాలలో మొక్కజొన్న సాగు జరిగిందని, సుమారు లక్ష ఎకరాల మొక్కలు కొనుగోలుకు వస్తున్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్లో అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తూ వచ్చిన మొక్కజొన్నలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు చేయాలని, మద్దతు ధర 2400/- చెల్లించాలని రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఈ నామ్ విధానం ద్వారా కొనుగోలు చేయాలన్నారు,
పెసర్లు, మినుములు, వేరుశనగ, తదితర పంటల వైపు రైతులకు అవగాహన కల్పించాలని ఈ పంటల ద్వారా ప్రస్తుతం మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నందున రైతులు లాభాలలో ఉంటారని అన్నారు. అందుకు సంబంధిత శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మార్కెట్లో అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, మార్కెట్లో అంతర్గత సౌకర్యాలను అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.
కలెక్టర్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుజన్ బాబు, వ్యవసాయ శాఖ అధికారిని సరిత, ఏడిఏ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ డిఎం వెంకటేశ్వర్లు, ఏఓ తిరుపతిరెడ్డి, తదితరులు ఉన్నారు.