Kamareddy: వరి కొనుగోలు సమస్యలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్

Kamareddy: కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.

Update: 2026-04-04 13:08 GMT

Kamareddy: వరి కొనుగోలు సమస్యలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్

Kamareddy: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ 08468-220051 అనే కంట్రోల్ రూమ్ నంబర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు తమకు ఎదురయ్యే సమస్యలు, సందేహాలు, కొనుగోలు సంబంధిత వివరాల కోసం ఈ నంబర్‌ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

వరి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమర్థతను పెంచేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

Tags:    

Similar News