Mulugu: ఆదివాసీల అక్షయ పాత్ర ఇప్పపువ్వు.. ఏజెన్సీలో సేకరణ షురూ!
Mulugu: ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో ఇప్పపువ్వు సేకరణ సందడి మొదలైంది.
Mulugu: ఆదివాసీల అక్షయ పాత్ర ఇప్పపువ్వు.. ఏజెన్సీలో సేకరణ షురూ!
Mulugu: ములుగు జిల్లా లోని ఏజెన్సీలలో దట్టమైన అడవి ప్రాంతాలలో మొదలైన ఇప్పపువ్వు సేకరణ. ములుగు జిల్లా ఏజెన్సీ లో ఆదివాసీలకు ఒక ఆదాయ వనరుగా మారిన ఇప్పపువ్వు. గొత్తి కోయ గూడాలలో ఇప్పపువ్వు సేకరణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆదివాసీ మహిళలు. ఇప్పపువ్వును గిరిజన సొసైటీలు తీసుకోకపోవడంతో తక్కువ ధరతో సంతలు అమ్ముతున్న ఆదివాసీలు.
వచ్చిన సొమ్ముతో నిత్యవసర సరుకులు కొనుక్కుని వాటితో సంవత్సరం అంతా జీవనం సాగిస్తామంటున్న ఆదివాసీలు. ములుగు జిల్లా ఏజెన్సీలో దొరికే ఇప్పపువ్వు కేవలం పువ్వు మాత్రమే కాదు. అది ఆదివాసీలకు ఆహారంగా, ఔషధంగా,ఒక ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందంటున్నారు. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్,నెలలో ఇప్ప చెట్టు ఇప్ప పుష్పాలతో కళకళలాడుతుంది.
ఇప్ప పూలు నేలపై పడిన వెంటనే ఆదివాసి మహిళలు తెల్లవారుజామునే ఇప్పపువ్వు సేకరణకు వెళ్తారు. రెండు నెలల వేసవి సీజన్లో ఒక్క కుటుంబం 2 నుండి 3 క్వింటాలు ఇప్ప పువ్వు సేకరిస్తారు. సేకరించిన ఇప్ప పువ్వులను ఎండబెట్టి మార్కెట్లో అమ్మి. అవసరాలను తీర్చుకుంటామని చెప్తున్నారు.