Vikarabad: ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరికి ఘన వీడ్కోలు
Vikarabad: వికారాబాద్ జిల్లాలో 11 నెలల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరికి జిల్లా యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది.
Vikarabad: ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరికి ఘన వీడ్కోలు
Vikarabad: ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి 11 నెలల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకొని వెళ్తున్న క్రమంలో జిల్లా యంత్రాంగం వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిజాయితీగా పనిచేయడం సంతృప్తిని కలిగిస్తుందన్నారు. హర్ష్ చౌదరి ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా 11 నెలల పాటు వివిధ శాఖల్లో ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని కలెక్టర్ అన్నారు.
మారుమూల మండలం దౌల్తాబాద్ తహసిల్దారుగా విధులు నిర్వహించే క్రమంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా మౌలిక సదుపాయాలతో పాటు రెవెన్యూ సమస్యల పెండింగ్ లు తగ్గించడంలో అంకితభావంతో పనిచేశారని కలెక్టర్ అన్నారు.
తనకు ఇచ్చిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తూ తన పట్ల నమ్మకాన్ని పెంపొందించుకున్నారని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మృదు స్వభావి అని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే వారని అన్నారు.
ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లాలో శిక్షణ కాలం పూర్తిగా విజయవంతం చేసుకోవడానికి కలెక్టర్లు, జిల్లా అధికారులు తోడ్పాటు అందించారన్నారు. జిల్లాలో శిక్షణ కాలం పూర్తి చేసుకోవడం సంతృప్తిని కలిగించిందని అన్నారు. శిక్షణకాలంలో తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, ఆర్డిఓలు, జిల్లా అధికారులు ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి ని పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వీడ్కోలు సమావేశంలో అదనపు కలెక్టర్లు ఉమా శంకర్ ప్రసాద్, రాజేశ్వరి, డిఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ లు వాసు చంద్ర, కె. అనిత, డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్, డిటి డబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.