Mancherial: దేవులవాడలో పోలీసుల మెరుపు తనిఖీలు.. గుడుంబా స్థావరాలు ధ్వంసం, 37 వాహనాలు సీజ్!
మంచిర్యాల: జిల్లా కోటపల్లి మండలం లోని దేవులవాడ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ని నిర్వహించిన పోలీసులు.
Mancherial: దేవులవాడలో పోలీసుల మెరుపు తనిఖీలు.. గుడుంబా స్థావరాలు ధ్వంసం, 37 వాహనాలు సీజ్!
మంచిర్యాల: జిల్లా కోటపల్లి మండలం లోని దేవులవాడ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ని నిర్వహించిన పోలీసులు. 70 లీటర్ల గుడుంబా స్వాధీనం, 2000 లీటర్ల గుడుంబా తయారీలో ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం, సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను సీజ్ చేసిన పోలీసులు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అలాగే ఇంట్లో నివాసం ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నేర రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రజల వద్దకే పోలీస్ అని ముఖ్య ఉద్దేశంతో గ్రామాలలో ఇలాంటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గ్రామాలలో ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని, ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటావని హెచ్చరించారు.
ముఖ్యంగా గ్రామాలలో గుడుంబా, గంజాయి వంటి వాటికి యువత, ప్రజలు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాగే గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, చెన్నూర్ సిఐ బన్సీలాల్, రూరల్ సిఐ కృష్ణ, ఎస్ఐలు సుబ్బారావు, రాజశేఖర్, జగదీశ్వర్, మరియు ఇతర సిబ్బంది సుమారు 50 మంది పోలీసులు పాల్గొన్నారు.