Nalgonda: మిర్యాలగూడలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!
Nalgonda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Nalgonda: మిర్యాలగూడలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!
నల్లగొండ/మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ దుశ్చర్యపై ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహిళలు, చిన్నపిల్లల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డీఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో అబలలపై అగైత్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.