Nalgonda: పన్ను చెల్లించండి - నగరాభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి
Nalgonda: నల్లగొండ నగర అభివృద్ధి కోసం పౌరులు బాధ్యతగా ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర పిలుపునిచ్చారు.
Nalgonda: పన్ను చెల్లించండి - నగరాభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి
నల్లగొండ జిల్లా: నల్లగొండ నగర సమగ్ర అభివృద్ధికి పౌరులు తమ వంతు బాధ్యతగా ఆస్తి పన్ను చెల్లించాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర పిలుపునిచ్చారు. పన్నుల చెల్లింపులో సీనియర్ సిటిజన్లు చూపుతున్న చైతన్యం అభినందనీయమని, వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు గడువులోగా పన్నులు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న 5 శాతం ముందస్తు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయమే నగరాభివృద్ధికి ఇంధనమని, బకాయిలు పెండింగ్‌లో పెట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.