Anantapur: కళ్యాణదుర్గంలో రూ. 30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Anantapur: కళ్యాణదుర్గంలో 24 మంది అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ. 30 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
Anantapur: కళ్యాణదుర్గంలో రూ. 30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు.
ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు వైద్య ఖర్చుల కారణంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తక్షణ సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం పట్టణం ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,టీడీపీ సీనియర్ నాయకులు,స్థానిక నాయకులు మరియు ప్రజలు బాధితులు పాల్గొన్నారు. మొత్తం 24 మంది బాధితులకు దాదాపు రూ.30 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ప్రతి అప్లికేషన్‌ను సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఎక్కడా ఆలస్యం లేకుండా సహాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి దృష్టిలో పేద ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైందని,అందుకే ప్రతి కేసును వేగంగా పరిష్కరించి సహాయం అందిస్తున్నామని చెప్పారు.
అలాగే లెటర్ ఆఫ్ క్రెడిట్ విధానం ద్వారా నేరుగా ఆసుపత్రులకు ఖర్చులు చెల్లించే విధంగా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దీని వల్ల బాధితులు అప్పుల బారిన పడకుండా,సమయానికి వైద్య చికిత్స పొందగలుగుతున్నారని అన్నారు.
ఇలాగే భవిష్యత్తులో కూడా అవసరమైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.