Anantapur: మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే అండ

Anantapur: టీడీపీ సభ్యత్వం ఉన్న కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ. 5 లక్షల బీమా చెక్కును అందజేశారు.

Update: 2026-04-09 10:09 GMT

Anantapur: మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షలు పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే అండ

అనంతపురం జిల్లా: టీడీపీ పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్త ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే అమిలినేని.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఈ విషాద ఘటనతో కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ,తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న కారణంగా పార్టీ తరఫున అందే సహాయాన్ని అందించేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో నేడు కళ్యాణదుర్గం పట్టణం ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు లక్ష్మీదేవి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఇలాంటి దుర్ఘటనల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మరియు పార్టీ తరఫున సాధ్యమైనంత సహాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. లక్ష్మీదేవి కుటుంబానికి ధైర్యం చెప్పి,భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక నాయకులు కూడా కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ,ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Tags:    

Similar News