Anantapur: కర్ణాటకలో అనంతపురం వాలంటీర్ల జోరు.. జాతీయ సమైక్యత శిబిరంలో సందడి!
Anantapur: కర్ణాటకలో జరుగుతున్న జాతీయ సమైక్యత శిబిరంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ప్రతిభ.
Anantapur: కర్ణాటకలో అనంతపురం వాలంటీర్ల జోరు.. జాతీయ సమైక్యత శిబిరంలో సందడి!
Anantapur: ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాల విద్యార్థులతో 7 రోజుల పాటు కర్ణాటక నందలి ఆదిచుంచున గిరి విశ్వవిద్యాలయం నందు జరుగుతున్న నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీరులు- చంద్ర శేఖర్ ఆర్ట్స్ కళాశాల అనంతపురం పి. కార్తిక్ -ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల,
మనూష - కే యస్ యన్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రక్షిత-ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్మవరం, సంధ్య- పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెనుకొండ,సారిక -ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి, మేఘన -సప్తగిరి డిగ్రీ కళాశాల హిందూపురం. యోహాన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నం, M.D. ఆక్రమ్ , బాలాజీ విద్యా విహార్, హిందూపూర్, గంగాధర్ యస్. కే.యూనివర్సిటీ, ల బృందం చురుకుగా పాల్గొంటున్నది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయాలు, సాంస్కృతిక అంశాలు, భిన్నత్వంలో ఏకత్వం వంటి విలువలను తెలుసుకుంటారు. ఈ శిబిరం ద్వారా యువతలో జాతీయ ఐక్యత, సామాజిక సౌహర్ద్రం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ముఖ్య ఉద్దేశముగా కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల
విద్యార్థులు తమ తమ ప్రాంతాల సంప్రదాయాలను ప్రదర్శిస్తూ , సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తుండగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ తరఫున వాలంటీర్లు కూడా ఉపన్యాసము, శ్రమదానం, నృత్యము, గానము మొదలైన వాటిలో పాల్గొంటూ ప్రతిభను కనబరుస్తున్నారని కే.టి. ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాయదుర్గం కు చెందిన ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ , ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి డి. నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా తనను ఆంధ్ర ప్రదేశ్ తరఫున శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ జాతీయ సమైక్యత శిబిరానికి పంపినందుకు యూనివర్సిటీ వారికి మరియు కళాశాల ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.